హీరోయిన్ ప్రణీత బేబీ షవర్

Pranitha Subhash Baby Shower. హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా

By Medi Samrat  Published on  6 Jun 2022 12:58 PM IST
హీరోయిన్ ప్రణీత బేబీ షవర్

హీరోయిన్ ప్రణీత సుభాష్ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ పూర్తిగా పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టింది. 2021 సంవత్సరంలో మే 30న వ్యాపారవేత్త నితిన్‌ రాజును పెళ్లి చేసుకుంది ప్రణీత. చాలా గోప్యంగా తన పెళ్లి విషయాన్ని ఉంచింది. సెకండ్ లాక్‌డౌన్ సమయంలో చాలా తక్కువమంది సమక్షంలో ప్రణీత పెళ్లి జరిగిపోయింది. కొద్ది నెలల కిందట తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది.

కొద్దిరోజుల కిందట ప్రణీత సీమంతం ఫంక్షన్ చాలా గ్రాండ్‌గా జరిగింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టినప్పటి నుండి ప్రణీత గర్భిణీలకు ఎన్నో చిట్కాలను అందిస్తూ.. తన అనుభవాన్ని కూడా అందరితో పంచుకుంటూ ఉంది. తాజాగా తన బేబీ షవర్ కు సంబంధించిన ఫోటోలను పోస్టు చేసింది. తనకు అత్యంత సన్నిహితుల మధ్య ప్రణీత బేబీ షవర్ ను నిర్వహించింది. భర్త మిత్రుల మధ్య.. ఎంజాయ్ చేస్తూ బేబీ షవర్ ను జరుపుకుంది ప్రణీత.



Next Story