పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు.

By Medi Samrat
Published on : 12 July 2025 11:15 AM IST

పవన్‌పై మరోసారి ప్రకాశ్ రాజ్ విమర్శలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి విమర్శలు చేశారు. హైదరాబాద్ లో నిర్వహించిన రాజ్యభాష విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొని హిందీ గురించి మాట్లాడారు. మాతృభాష అమ్మ అయితే, హిందీ భాష పెద్దమ్మ అని ఆయన అన్నారు. మనం హిందీ నేర్చుకోవడం అంటే మన ఉనికిని కోల్పోయినట్టు కాదని, మనం మరింత బలపడటమని చెప్పారు.

ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. "ఈ రేంజ్ కి అమ్ముకోవడమా... ఛిఛీ... జస్ట్ ఆస్కింగ్" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందీ ప్రాముఖ్యతను, మెరుగైన కమ్యూనికేషన్ కోసం దానిని నేర్చుకోవడంలో దాని ప్రయోజనాలను నొక్కి చెబుతూ పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

Next Story