విందుకు పిలిచిన ప్రకాష్ రాజ్

Prakash Raj Arrange Lunch For MAA Members. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఒక్కో టీమ్.. ఒక్కో రకంగా కీలక

By Medi Samrat  Published on  12 Sept 2021 10:16 PM IST
విందుకు పిలిచిన ప్రకాష్ రాజ్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు ఒక్కో టీమ్.. ఒక్కో రకంగా కీలక ప్రకటనలు చేస్తోంది. తాజాగా సినీ పరిశ్రమలోని కార్మికుల సమస్యల గురించి చర్చించేందుకు ప్రకాశ్ రాజ్ పిలుపునిచ్చారు. మా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన ఆయన.. ప్రచారంలోకి దిగారు. తాజాగా సినీ కళాకారుల సమస్యల గురించి తెలుసుకునేందుకు వారితో ప్రకాశ్ రాజ్ సమావేశమైనట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో ఆయన విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. ''అందరం మాట్లాడుకుందాం. మా లక్ష్యాలపై చర్చిద్దాం. అందరం కలిసి విందు చేద్దాం'' అంటూ ఓ ఆహ్వాన సందేశాన్ని సినీ కళాకారులకు ప్రకాశ్ రాజ్ టీమ్ పంపినట్టు తెలుస్తోంది.

హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షెన్ సెంటర్ లో ఈ సమావేశం జరిగింది. ఈ కీలక విందు సమావేశానికి 'మా'లో సభ్యత్వం ఉన్న నటీనటులు 100 మంది వరకు హాజరయ్యారు. ఈ సమావేశంలో 'మా' ఎన్నికల ప్రణాళిక, సభ్యుల సంక్షేమంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ, తమ ప్యానెల్ గెలిస్తే 'మా' సభ్యుల సంక్షేమానికి రూ.10 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. అసోసియేషన్ లో చాలామంది సభ్యులు క్రియాశీలకంగా లేరని అన్నారు.


Next Story