బిగ్ బ్రేకింగ్ : కేజీఎఫ్ డైరెక్ట‌ర్ - ప్ర‌భాస్ కాంబోలో 'సలార్'

Prabhas teams up with KGF director. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది.

By Medi Samrat  Published on  2 Dec 2020 9:54 AM GMT
బిగ్ బ్రేకింగ్ : కేజీఎఫ్ డైరెక్ట‌ర్ - ప్ర‌భాస్ కాంబోలో సలార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల‌కు అదిరిపోయే స‌ర్‌ప్రైజ్ వ‌చ్చేసింది. ప్ర‌భాస్‌ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 'కేజీఎఫ్' చిత్రాన్ని నిర్మించిన హోంబలే ఫిలింస్ నిర్మాణ సంస్థ మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను డిసెంబర్ 2న ప్రకటించబోతున్నారని చెప్పడంతో ఇది ప్రభాస్ తో చేయబోయే సినిమానే అని అంద‌రూ బావించారు.

కాగా.. ఆ ఈ వార్తలను నిజం చేస్తూ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్' అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించారు. 'కేజీఎఫ్' మేకర్స్ నిర్మిస్తున్న 'సలార్' చిత్రానికి సంబంధించిన పోస్టర్ ని కూడా విడుదల చేసారు. ది మోస్ట్ వైలెంటెడ్ మ్యాన్ అంటూ రిలీజ్ చేసిన 'సలార్' పోస్టర్ లో ప్రభాస్ తుపాకీ మీద చేయి పెట్టి వైలెంట్ గా చూస్తున్నాడు. ఇది ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన 'ఉగ్రమ్' చిత్రానికి రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ 'సలార్' వరల్డ్ లో 2021జనవరిలో అడుగుపెట్టబోతున్నాడంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది.
Next Story