కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన కల్కి 2898 AD ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ ప్రాజెక్ట్‌గా 'కల్కి 2898 AD' ప్రేక్షకుల ముందుకు వచ్చింది కల్కి. అద్భుతమైన స్టార్‌కాస్ట్, గ్రాండ్ స్కేల్ తో ఈ సినిమా థియేటర్లలో ఊపు తెప్పించింది. ముఖ్యంగా మంచి స్టోరీతో.. గ్రాండ్ గా.. నిజంగా మన తెలుగు సినిమానేనా అనిపించేలా సినిమా ప్రేక్షకులకు కావాల్సిన వినోదం మొత్తాన్ని అందించింది.
ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు గెస్ట్ అప్పియరెన్స్ తో మోత మోగించారు. ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా మెప్పించగా.. మహాభారతం నాటి కథలో కూడా ఒక పాత్ర పోషించారనే టాక్ వినిపించింది. అయితే ఆ పాత్ర మరేదో కాదు.. సూర్య పుత్ర 'కర్ణుడు'. ప్రభాస్ లాంటి స్టార్ తో కర్ణుడి పాత్ర పోషించేలా చేయడం నాగ్ అశ్విన్ కే దక్కింది. అలాగే క్లైమాక్స్ లో నాగ్ అశ్విన్ ప్రభాస్ ను చూపించిన విధానం అభిమానులకు పూనకాలు తెప్పించింది.