ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌ కళ్యాణ్ కు దేవుడే

ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని అన్నారు.

By Medi Samrat  Published on  5 April 2024 7:15 PM IST
ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌ కళ్యాణ్ కు దేవుడే

ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ రాష్ట్రంలో వాలంటీర్లపై ఆంక్షలకు చంద్రబాబే కారణమని అన్నారు. వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేలా నిమ్మగడ్డ రమేశ్ ను పురికొల్పింది చంద్రబాబేనని.. వాలంటీర్ల సేవలు చూసి చంద్రబాబు ఓర్వలేకపోయారని, అందుకే ఇంటి వద్దనే పెన్షన్లు ఇవ్వకుండా అడుకున్నారన్నారు. గతంలో చంద్రబాబు కాపులను రౌడీలని అన్నారని.. ఎన్ని అన్యాయాలు చేసినా చంద్రబాబు అంటే పవన్‌ కళ్యాణ్ కు దేవుడన్నారు. చంద్రబాబు కులాల మధ్య, మతాల మధ్య గొడవలు పెడతారన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయ భవిష్యత్ కోసం నాడు రంగాను పొట్టనబెట్టుకున్నారన్నారు. ఇప్పుడు రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ ను కూడా లొంగదీసుకున్నారు. పవన్ ను పక్కనబెట్టుకుని కాపులను మోసం చేయాలని చంద్రబాబు ప్రణాళిక రచించారని వ్యాఖ్యలు చేశారు పోసాని.

చంద్రబాబు సొంతంగా పార్టీ పెట్టుకోడు.. ఇంటింటికి తిరగడు. చంద్రబాబు కాంగ్రెస్‌ నుంచి టీడీపీలోకి వచ్చాడన్నారు పోసాని. చంద్రబాబు ఏనాడైనా సొంతంగా ఒక పార్టీ పెట్టాడా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు... తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏమైనా చేస్తారని పోసాని వ్యాఖ్యలు చేశారు.

Next Story