పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి
Posani Krishna Murali Fires On Pawan Kalyan. జనసేన అధినేత రచయిత పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం
By Medi Samrat Published on 27 Sept 2021 9:04 PM ISTజనసేన అధినేత రచయిత పోసాని కృష్ణమురళి నిప్పులు చెరిగారు. సోమవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను చంద్రబాబు హయాంలో ఎన్నో విధంగా చిత్ర హింసలు పెట్టారు ప్రశ్నించావా పవన్ కళ్యాణ్..? అంటూ ఫైర్ అయ్యారు. నీకు ప్రేమ వున్నప్పుడు చంద్రబాబుని ఇంద్రుడు అంటావు.. లేకపోతే తిడతావని అన్నారు. పవన్ నువ్వు ఏ పార్టీతో సరిగ్గా వున్నావు.. ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని.. ఏ పార్టీని మిగిల్చావు..? అని సంచలన వ్యాఖ్యలుచేశారు.
పవన్ కళ్యాణ్ ప్రజల మనిషి కాదని.. మనీ మనిషి అని పోసాని మండిపడ్డారు. నువ్వు రాజకీయంగా ఎన్నో తప్పులు చేస్తున్నావని.. నేను ఒన్ టాలెంట్ తో పైకి వచ్చానని అన్నారు. చిరంజీవి సంస్కార వంతుడు.. చిరంజీవి ఇంట్లో అడపడుచుల్ని గురించి అసాసినెట్ చేస్తే నువ్వు ఎక్కడ ప్రశ్నించావు.. నేను ప్రశ్నించాను.. అందుకే అప్పుడు వాళ్ళు నన్ను చంపుతానని అన్నారని.. పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు ఎక్కడ ప్రశ్నించాలో తెలీదని అన్నారు.
జగన్ మంచి పనులు చేస్తున్నారు అందుకే నాకూ జగన్ అంటే ప్రేమని చెప్పారు. పవన్.. నీ రెమ్యునరేషన్ ఎంత రూ.10 కోట్లా.. లేక రూ.50 కోట్లా.. నీ రెమ్యునరేషన్ పది కోట్లు అయితే నేను నీతో నాలుగు సినిమాలు చేస్తానని పోసాని అన్నారు. పవన్ మీ సినిమాలకు టిక్కెట్ రేట్లు రూ.500, రూ.1000 అంటే ఏమిటి.. మధ్య తరగతి, సామాన్యులను హింసించడమే కదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ లని.. వారు ఏనాడూ డిస్ట్రిబ్యూషన్ విషయంలో.. డబ్బుల విషయాల్లో వేలు పెట్టే వారు కాదని.. వారు నిజ జీవితంలో, తెర జీవితంలోనూ రియల్ స్టార్ లని అని అన్నారు.
పవన్ కళ్యాణ్ నీకు ఏ క్వాలిటీస్ వున్నాయని జగన్ ను తిడుతున్నావని నిలదీశారు. నువ్వు కులాలను రెచ్చకొడుతున్నావు.. దిల్ రాజుని అన్నావు.. అయన దగ్గర వేరే కులాల వాళ్ళు కూడా ఎంతో మంది పనిచేస్తున్నారు. 35 ఏళ్ల నుంచి చిరంజీవిని చూస్తున్నాను. చిరంజీవి ఒక్కసారి అయినా ఎవరిని అయినా ఒరేయ్ అన్నాడా?? నేర్చుకో పవన్ అంటూ హితువు పలికారు. కారణం లేకుండా పవన్.. జగన్ ని తిడుతూ వుంటాడని అన్నారు.