కుక్క ఫోటో షేర్ చేసిన పూనమ్.. రామ్ గోపాల్ వర్మ ఏమన్నారంటే?
ఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమికి సంబంధించిన తొలి లిస్ట్ శనివారం నాడు ప్రకటించారు.
By Medi Samrat Published on 24 Feb 2024 7:04 PM ISTఏపీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ-జనసేన కూటమికి సంబంధించిన తొలి లిస్ట్ శనివారం నాడు ప్రకటించారు. 99 మంది అభ్యర్ధులతో తొలి లిస్ట్‌ను చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు రిలీజ్ చేశారు. 94 మంది టీడీపీ అభ్యర్ధులు కాగా.. జనసేన అభ్యర్ధులు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు. మొత్తం 24 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలలో పోటీ చేయనున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉండగా.. పూనమ్ కౌర్ చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
పవన్ కళ్యాణ్ ని గతంలో పలు మార్లు పూనమ్ కౌర్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఆమె ఎలాంటి ట్వీట్ వేసినా, కామెంట్ చేసినా పవన్ కళ్యాణ్‌కి, దర్శకుడు త్రివిక్రమ్ కు లింక్ చేస్తుంటారు. జనసేన-టీడీపీ సీట్లు ప్రకటించగానే.. కుక్క ఫొటోని తన ట్విట్టర్‌లో షేర్ చేసింది పూనమ్ కౌర్. హీరోయిన్ శ్రీదేవి కుక్కని ఆడిస్తూ ఉన్న ఫొటోని షేర్ చేసింది పూనమ్. అయితే ఆమె పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఈ పోస్టు చేసిందని అంటున్నారు. జనసేనకు 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ స్థానాలు మాత్రమే కేటాయించడంపై ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ట్రోల్ చేస్తారనే భయంతోనే 24 సీట్లు కేటాయించారంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. ‘23 ఇస్తే టీడీపీ లక్కీ నెంబర్ అని ట్రోల్ చేస్తారు....25 ఇస్తే పావలాకి పావలా సీట్లు ఇచ్చారని ట్రోల్ చేస్తారు...అందుకే మధ్యే మార్గంగా 24 స్థానాలు ఇచ్చారు’ అని ఆర్జీవీ చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతూ ఉంది.