బాబాయ్ కోసం.. రామ్ చరణ్ 'పెద్ది' వచ్చేది అప్పుడే..!

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీలో మార్పు జరిగింది.

By -  Medi Samrat
Published on : 4 Feb 2026 6:50 PM IST

బాబాయ్ కోసం.. రామ్ చరణ్ పెద్ది వచ్చేది అప్పుడే..!

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదల తేదీలో మార్పు జరిగింది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్నిమార్చి 27న విడుదల చేయాలని భావించారు. పవన్ కల్యాణ్ కొత్త చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26న వస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో, 'పెద్ది' విడుదల తేదీని వెనక్కి జరిపారు. “అతడి రాక తేదీ మారుతుంది, కానీ అతడి దృఢ సంకల్పం మారదు” అంటూ చిత్రబృందం చేసిన ప్రకటన అభిమానుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు.

బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.

Next Story