ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ విలేకరుల సమావేశంలో సినీ పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కథానాయికలను అడవుల రక్షకులుగా చిత్రీకరిస్తూ ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. గొడ్డలి పట్టుకుని స్మగ్లింగ్ చేయడం నేటి సినిమాలో హీరోయిజానికి కొత్త నిర్వచనంగా మారిందని పేర్కొన్నారు. దాదాపు 40 ఏళ్ల క్రితం రాజ్‌కుమార్ హీరోగా వచ్చిన ‘గంధాడ గుడి’ సినిమాలో వేటగాళ్ల నుంచి అడవులను రక్షించే అధికారిగా హీరో నటించారని, ప్రస్తుత సినిమాల్లో హీరో అంటే చెట్లను నరికే స్మగ్లర్‌గా ఉంటారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. ఆంధ్రా-కర్ణాటక బోర్డర్‌లో గంధపు చెక్కల స్మగ్లింగ్ గురించి కళ్యాణ్ ప్రస్తావించారు.
అది కేవలం సినిమా, నేను కూడా సినిమాలో భాగమే.. చాలాసార్లు, నేను తప్పు సందేశం పంపుతానని భయపడి, అలాంటి పాత్రలు చేయడానికి వెనకాడుతూ ఉంటానని పవన్ కళ్యాణ్ అన్నారు. కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో సమావేశమైన ఆయన ఏడు అంశాలపై చర్చించారు. చిత్తూరు జిల్లాలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవి ఏనుగులను తరిమికొట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం 8 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.