ఆ రెండు షోలు పడితే.. 'ఓజీ' ఆల్ టైమ్ రికార్డు సాధ్యమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

By -  Medi Samrat
Published on : 14 Sept 2025 4:46 PM IST

ఆ రెండు షోలు పడితే.. ఓజీ ఆల్ టైమ్ రికార్డు సాధ్యమే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'OG' సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. 'OG' సినిమా రెండు స్పెషల్ షోలు, టికెట్ల పెంపు ఉంటుందని తెలుస్తోంది. అదే జరిగితే ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్ కు దారి తీస్తుంది.

ఈ సినిమా భారీ హైప్ సాధించి, భారీ బిజినెస్ చేయడంతో, సెప్టెంబర్ 24 రాత్రి పెయిడ్ ప్రీమియర్ల ద్వారా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను క్యాష్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సెప్టెంబర్ 25న తెల్లవారుజామున 1 గంటలకు / 5 గంటలకు మరో స్పెషల్ షో కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ప్రదర్శనలకు టిక్కెట్ల పెంపు ఉంటుంది. అదనపు ప్రదర్శనలతో పాటు, 10 రోజుల పాటు టికెట్స్ హైక్ కు అనుమతి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ OG సినిమా స్పెషల్ షోలు, టిక్కెట్ల పెంపుతో భారీ ఓపెనింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి భారీ క్రేజ్ ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్ సాధించే దిశగా ఇది ఖచ్చితంగా దూసుకుపోతోంది. 74.3 కోట్లతో పుష్ప 2, 74 కోట్లతో RRR తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించాయి. “దే కాల్ హిమ్ OG” ఖచ్చితంగా వీటిని బద్దలు కొట్టడం ద్వారా ఆల్ టైమ్ రికార్డ్‌ను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటుంది.

Next Story