పవన్ 'ఖుషి' సినిమా.. రీరిలీజ్ చిత్రాల రికార్డులు బ్రేక్ చేసింది

Pawan Kalyan Movie Kushi Rerelease Firstday Collections. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఖుషి' ని న్యూయర్ సందర్భంగా రీ రిలీజ్ చేశారు.

By Medi Samrat
Published on : 2 Jan 2023 5:33 PM IST

పవన్ ఖుషి సినిమా.. రీరిలీజ్ చిత్రాల రికార్డులు బ్రేక్ చేసింది

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ సినిమా 'ఖుషి' ని న్యూయర్ సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఈ సినిమా వచ్చి దాదాపు 22 ఏళ్లవుతోంది. ఈ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడ్డారు. రీ రిలీజ్ కలెక్షన్స్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. తొలిరోజు.. ప్రపంచ వ్యాప్తంగా రూ.4.15 కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.3.62 కోట్ల వసూళ్లు దక్కాయి. రీరిలీజ్ అయిన చిత్రాల్లో తొలి రోజే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా 'ఖుషి' రికార్డు సాధించింది. ఇప్పటివరకు రూ. 3.20 కోట్లతో అగ్రస్థానంలో ఉన్న పవన్ కల్యాణ్ 'జల్సా' రికార్డు బ్రేక్ అయింది. మహేశ్ బాబు 'పోకిరి' చిత్రం రీరిలీజ్ లో రూ. 1.52 కోట్లతో మూడో స్థానంలో ఉన్నట్టు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమాను థియేటర్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఓ థియేటర్లో అకిరా నందన్ సీక్రెట్‌గా ఈ ఖుషి సినిమాను చూశాడు. కొందరు మాత్రం అకిరా నందన్‌ను గుర్తు పెట్టేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.


Next Story