అనుకోని వివాదంలో ఇరుక్కున్న హీరో సిద్ధార్థ్..

Outrage Over Actor Siddharth's Tweet On Badminton Star Saina Nehwal's Post. సినీ హీరో సిద్ధార్థ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా

By Medi Samrat  Published on  10 Jan 2022 4:43 PM IST
అనుకోని వివాదంలో ఇరుక్కున్న హీరో సిద్ధార్థ్..

సినీ హీరో సిద్ధార్థ్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా వైఫల్యంపై స్పందిస్తూ స్టార్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేయగా.. దీనిపై స్పందించిన హీరో సిద్ధార్థ్‌ సైనా ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ఘాటు పదాలను వాడాడు. ఈనెల 6న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పంజాబ్ పర్యటనలో భాగంగా ఫిరోజ్ పూర్ కు వెళ్లారు. రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రధాని వాహనాలను రైతులు అడ్డిగించి నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో నరేంద్ర మోదీ భద్రత లోపం గురించి సోషల్ మీడియా పెద్ద దుమారమే రేగింది. ఈ విషయంపై సైనా నేహ్వల్ స్పందిస్తూ.. మా ప్రధాని భద్రత విషయంలో రాజీ పడితే ఏ దేశం కూడా సురక్షితంగా ఉండదు. ఈ పిరికివాళ్ల దాడిని నేను ఖండిస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. అయితే సైనా నేహ్వాల్ చేసిన కామెంట్స్ ను రీట్వీట్ చేస్తూ.. కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్.. థ్యాంక్స్ గాడ్ మాకు ప్రొటెక్టర్స్ ఆఫ్ ఇండియా. షేమ్ ఆన్ యూ రిహన్నా అంటూ ట్వీట్ చేశాడు.

సిద్ధార్థ్‌ చేసిన ఈ కామెంట్స్‌ వివాదానికి దారితీశాయి. సిద్ధార్థ్‌ వాడిన పదజాలంపై జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే సిద్ధార్థ ట్విటర్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాలని ట్విటర్‌ ఇండియాకు లేఖ రాసింది. సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ ఆడవారిని అవమానపరిచేలా ఉన్నాయంటూ పలువురు ప్రముఖులు వ్యాఖ్యలను ఖండించారు.

సింగర్ చిన్మయి శ్రీపాద సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించారు. మహిళలను అవమానకరించేలా పదాలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు. "ఇది నిజంగా దారుణం. సిద్ధార్థ్ మాలో చాలా మంది మహిళలు పోరాడుతున్న విషయాలకు మీరు సహకరించారు. కానీ కాక్ ఛాంపియన్ ఆఫ్ ది వరల్డ్‌ ఆ పదానికి మరో అర్ధం ఉంది.. అమ్మాయిని ఆ పదంతో సంబోధించడం అవమానకరం " అంటూ చిన్మయి ట్వీట్ చేసింది.

కాసేపటి తర్వాత సిద్ధార్థ్ ప్రతిస్పందిస్తూ తాను ఎవరినీ అగౌరవపరచడం లేదని అన్నాడు. కాక్ అండ్ బుల్. అదే రిఫరెన్స్. అగౌరవంగా ఏమీ ఉద్దేశించబడలేదు, చెప్పలేదు.. అని అన్నాడు. బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్ కూడా సిద్ధార్థ్ ను విమర్శించారు. సిద్ నుండి ఇలాంటి వ్యాఖ్యలు ఆశించలేదు. ఇవి చాలా చెత్త వ్యాఖ్యలు అని తెలిపింది.


Next Story