పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరో తాజా చిత్రం హరి హర వీర మల్లు సినిమాకు వస్తున్న స్పందన చూసి తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే.. ఆయన తదుపరి చిత్రం OG కోసం వారు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రం మొదటి సింగిల్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. సుజీత్ దర్శకత్వం వహించిన “దే కాల్ హిమ్ OG” టీజర్‌తోనే భారీ అంచనాలను సృష్టించింది. ఇది తెలుగు సినిమా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం.
తాజా అప్డేట్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ అభిమానులకు బహుమతిగా మేకర్స్ OG సినిమాకు సంబంధించి మొదటి సింగిల్‌ను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ప్రమోషన్‌లను ప్రారంభించడానికి చిత్ర బృందం హరి హర వీర మల్లు విడుదల కోసం వేచి ఉంది. HHVM ఈ వారం విడుదలైనందున.. OG బృందం ప్రమోషన్‌లను ప్రారంభించడానికి సిద్ధమైంది. మొదటి సింగిల్‌తో రాబోతూ ఉన్నారు. ఈ సింగిల్ ను వచ్చే వారం విడుదల చేయాలన్నది ప్రణాళిక.