పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రం $1.51 మిలియన్ల ప్రీమియర్లతో సంచలనం సృష్టించింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల పరంగా నాన్-బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ OG విడుదలకు 10 రోజుల ముందే ఆ రికార్డును బద్దలు కొట్టి పవన్ కళ్యాణ్ కెరీర్ లో అత్యధిక వసూళ్లలో ఒకటిగా నిలిచింది. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కలయిక కావడంతో అప్పట్లో సినిమా ఓపెనింగ్స్ విషయంలో అజ్ఞాతవాసికి భారీగా కలెక్షన్స్ వచ్చాయి.
ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కి అజ్ఞాతవాసి సినిమా అతిపెద్ద ప్రీమియర్ రిలీజ్ అని చెప్పుకోవచ్చు. కానీ ప్రీమియర్లకు ఇంకా 10 రోజులు మిగిలి ఉండగానే OG సినిమా కేవలం ప్రీ-సేల్స్ తో ఆ రికార్డును బద్దలు కొట్టింది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో అతిపెద్ద ఉత్తర అమెరికా ప్రీమియర్ గా నిలిచింది. ఈ చిత్రం ఇప్పుడు 2 - 3 మిలియన్ల ప్రీమియర్ మైల్ స్టోన్ కు దగ్గరగా ఉంది. తదుపరి ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ట్రైలర్ మరింత హైప్ ను పెంచితే, అది ప్రీమియర్ల కోసం 3.5 మిలియన్ల రేంజ్‌కు దగ్గరగా కూడా వెళ్లే అవకాశం ఉంది.