ఆహా.. 'ఆర్ ఆర్ఆర్' తరువాత వరుస సినిమాలతో బిజీ అవ్వనున్న ఎన్టీఆర్!

NTR UpComing Movies. నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో

By Medi Samrat  Published on  12 Feb 2021 2:13 PM GMT
ఆహా.. ఆర్ ఆర్ఆర్ తరువాత వరుస సినిమాలతో బిజీ అవ్వనున్న ఎన్టీఆర్!

నందమూరి హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఇది నాలుగో చిత్రం. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ వరుసగా పలు మూవీస్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోస్ లో దూసుకుపోతున్న ఎన్టీఆర్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. "టెంపర్" నుంచి వరుస హిట్లు అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో "ఆర్ ఆర్ ఆర్ "సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుంది.

ఇక 'ఆర్.ఆర్.ఆర్' సినిమా తరువాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ తో సినిమా చెయ్యబోతున్నాడు. ఇది పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో పాటు 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాతో కూడా ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశం ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి.

వీళ్ళతో పాటు తమిళ దర్శకుడు అట్లీ కూడా ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడం కోసం చాలా రోజుల నుండీ వెయిట్ చేస్తున్నాడు. 'వైజయంతి మూవీస్' బ్యానర్లో ఈ క్రేజీ ప్రాజెక్టు రూపొందే అవకాశం ఉంది.అంతేకాదు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వెంకీ కుడుముల వంటి దర్శకులు కూడా ఎన్టీఆర్ కోసం కథలు రెడీ చేసుకుంటున్నారు.ఇక దీన్ని బట్టి చూస్తే "ఆర్ ఆర్ ఆర్" సినిమా తరువాత ఎన్టీఆర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయేలా వున్నాడని స్పష్టంగా అర్ధమవుతుంది..
Next Story
Share it