భారీ కలెక్షన్స్ సాధించిన సింహాద్రి

NTR Simhadri Movie achieved huge collections. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా మే 20న 'సింహాద్రి' సినిమాను రీరిలీజ్ చేశారు.

By Medi Samrat  Published on  22 May 2023 4:45 PM IST
భారీ కలెక్షన్స్ సాధించిన సింహాద్రి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా మే 20న 'సింహాద్రి' సినిమాను రీరిలీజ్ చేశారు. తార‌క్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందిన ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొన‌సాగుతూ ఉండడంతో సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేశారు. ‘సింహాద్రి’ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.5.2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటి వరకు రీ-రిలీజ్ అయిన ఏ సినిమా తొలిరోజు ఇంత మొత్తం వసూలు చేయలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖుషి’ తొలిరోజు రూ.4.15 కోట్ల గ్రాస్‌తో ఇప్పటి వరకు టాప్‌లో ఉంది. ఆ సినిమాను ఇప్పుడు ‘సింహాద్రి’ దాటేసింది.

ఏరియాల వారీగా కలెక్షన్స్:

నైజాం: ₹1.10 Cr

సీడెడ్: ₹0.78 Cr

ఆంధ్ర: ₹1.56 Cr

కర్ణాటక: ₹0.32 Cr

తమిళనాడు: ₹0.13 Cr

రెస్టాఫ్ ఇండియా: ₹0.34 Cr

అమెరికా: ₹0.46 Cr

రెస్టాఫ్ వరల్డ్: ₹0.47 Cr

మొత్తం: ₹5.14 Cr


Next Story