శ్రీవారి సేవలో నూతన దంపతులు నిహారిక, చైతన్య
Niharika Chaithanya Visit Tirumala. డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటైన జంట నిహారిక, చైతన్య.
By Medi Samrat Published on
14 Dec 2020 6:18 AM GMT

డిసెంబర్ 9న వివాహ బంధంతో ఒక్కటైన జంట నిహారిక, చైతన్య. ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా వీరి వివాహం జరిగింది. అనంతరం డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో రిసెప్షన్ జరిగింది. ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇక సోమవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో నిహారిక, చైతన్య దంపతులు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకస్వామి మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. తన భర్త కుటుంబంతో కలిసి నిహారిక స్వామి వారిని దర్శించుకున్నారు. నిహారిక భర్త సాఫ్ట్ వేర్ కాగా, ఆయన తండ్రి ప్రభాకర్ రావు పోలీసు శాఖలో గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్నారు.
Next Story