ఎంజీఆర్‌గా ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్‌.. లుక్‌ నెట్టింట వైర‌ల్‌

New Look of Arvind Swami as MGR from Thalaivi. దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత పేరిట 'త‌లైవీ'‌ బయోపిక్

By Medi Samrat  Published on  24 Dec 2020 5:56 AM GMT
ఎంజీఆర్‌గా ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్‌.. లుక్‌ నెట్టింట వైర‌ల్‌

దివంగత తమిళనాడు మాజీ సీఎం, నటి జయలలిత పేరిట 'త‌లైవీ'‌ బయోపిక్ వ‌స్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కంగనారనౌత్‌.. జ‌య‌ల‌లిత పాత్ర‌ను పోషిస్తోంది. ఈ బ‌యోపిక్‌ ఏఎల్ విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుంది. ఇక‌ ఈ చిత్రం రీసెంట్‌గా హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

2021లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు చిత్ర‌బృందం. కాగా, జ‌య‌ల‌లిత జీవితంలో కీల‌క వ్య‌క్తి అయిన ఎంజీఆర్ పాత్ర‌ని.. ఒక‌ప్ప‌టి ల‌వ‌ర్ బాయ్‌ అర‌వింద్ స్వామి పోషిస్తున్నాడు. అయితే.. ఈ రోజు ఎంజీఆర్ జ‌యంతి సంద‌ర్భంగా.. అర‌వింద్ స్వామి పోషించిన ఎంజీఆర్ పాత్ర‌ ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. బ్లాక్ అండ్ వైట్ ఫోటోల‌లో విడుద‌లైన ఆ లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. కాసేప‌ట్లోనే నెట్టింట వైర‌ల్‌గా మారింది.

ఇదిలావుంటే.. ప్రజా నాయకుడుగా పేరుపొందిన‌ ఎంజీఆర్ త‌మిళ రాజ‌కీయాల‌లో కీల‌క పాత్ర పోషించారు. ఎంజీఆర్ మరణానంతరం ఆయన రాజకీయ వారసురాలిగా.. జయలలిత ఏఐఏడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆమె ఆరుసార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్టించారు. ఇక‌ ఈ మూవీలో కరుణానిధి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నారు.

ఇక.. 1991లో మణిరత్నం దళపతి సినిమా ద్వారా అరవింద్ స్వామి వెండితెరకు పరిచయం అయ్యాడు. అనంత‌రం మణిరత్నం దర్శకత్వంలోనే వచ్చిన రోజా (1992), బొంబాయి (1995) వంటి సినిమాల్లో కథానాయకుడి పాత్రల‌తో మంచి పేరు సంపాదించుకున్నాడు. 90ల‌లో అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడిగా, ల‌వ‌ర్ బాయ్‌గా అరవింద్ స్వామి గుర్తింపు తెచ్చుకున్నాడు.

Next Story