వైరల్ అవుతున్న నయనతార యాంకరింగ్ వీడియో..
ప్రముఖ నటి నయనతార జవాన్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది.
By Medi Samrat Published on 27 Sept 2023 7:40 PM ISTప్రముఖ నటి నయనతార జవాన్ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తోంది. సెప్టెంబర్ 7న విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం జవాన్‌లో నయనతార హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసింది. దీంతో చిత్ర తారాగణం, మేకర్స్‌తో సహా అందరూ సంబరాల్లో మునిగిపోయారు.
ఇదిలావుంటే.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో నయనతార ఒకరు. 38 ఏళ్ల నయనతార ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. నయనతార సినిమాల్లోకి రాకముందు స్మాల్ స్క్రీన్‌పై యాంకరింగ్ చేసేదని చాలా తక్కువ మందికి తెలుసు. ఇప్పుడు ఆమె యాంకరింగ్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో చాలా పాతది. ఇందులో నయనతార కాస్త బొద్దుగా కనిపిస్తుంది. దీంతో చాలా మంది అభిమానులు ఆమెను గుర్తించలేకపోతున్నారు. ఈ వీడియోలో ఆమె మలయాళ భాషలో యాంకరింగ్ చేస్తోంది. ఆమె నుదిటిపై బొట్టు బిల్ల, ఎరుపు రంగు ప్రింటెడ్ దుస్తులను ధరించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. నయనతార అని నమ్మలేకపోతున్నారని ఒక వినియోగదారు రాశారు. ప్లాస్టిక్ సర్జరీ ప్రతిదీ.. ఇప్పుడు ఇది చాలా భిన్నంగా కనిపిస్తుంది.. అని మరో వినియోగదారు రాశారు.
నయనతార 2003లో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. మలయాళ చిత్రం మనసినక్కరేతో తెరంగేట్రం చేసింది. దీని తర్వాత ఆమె తమిళం, తెలుగు సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం ఆమెను సౌత్ ఇండస్ట్రీలో 'లేడీ సూపర్ స్టార్' అని పిలుస్తారు. నయనతార మలయాళీ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించింది. ఆమె త్వరలో కన్నప్ప చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రానికి ముఖేష్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు.