ఓటీటీలో విడుద‌లైంది.. అయినా ఆ సినిమాను థియేటర్ రిలీజ్ చేస్తున్నారు

National Award-winning Telugu movie finally set to release in theaters. సుహాస్‌, చాందినీ చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కలర్‌ఫొటో. 2020 అక్టోబర్‌ 23న ఆహాలో విడుదలైంది కలర్‌ ఫొటో

By Medi Samrat  Published on  23 Oct 2022 8:30 PM IST
ఓటీటీలో విడుద‌లైంది.. అయినా ఆ సినిమాను థియేటర్ రిలీజ్ చేస్తున్నారు

సుహాస్‌, చాందినీ చౌదరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం కలర్‌ఫొటో. 2020 అక్టోబర్‌ 23న ఆహాలో విడుదలైంది కలర్‌ ఫొటో. సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించిన‌ ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేశారు. కలర్‌ఫొటో సినిమాలో ఉన్న ఎమోషన్ ఎంతో మందికి కనెక్ట్ అయింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనుకుంటున్న సినీ లవర్స్‌ కు గుడ్‌ న్యూస్‌ చెప్పారు మేకర్స్‌. తాజాగా చిత్ర నిర్మాత సాయిరాజేశ్‌, సందీప్‌ రాజ్‌ కలర్ ఫొటో థియేటర్ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా తెలియజేశారు. సందీప్‌ రాజ్‌ కథనందిస్తూ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, లౌక్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి. హర్ష చెముడు, శ్రీదివ్య, సునీల్‌ ఇతరీ కలక పాత్రలు పోషించారు. కాలభైరవ కంపోజ్‌ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది.

సినిమాలంటే పిచ్చి ఉన్న ఒక బ్యాచ్ కలిసి చేసిన సినిమా.. కలర్ ఫోటో. కరోనా వ్యాప్తి కారణంగా, మేకర్స్ ఈ చిత్రాన్ని నేరుగా OTT ప్లాట్‌ఫారమ్‌లో విడుదల చేసారు. ఈ చిత్రం ఉత్తమ తెలుగు చిత్రం విభాగంలో జాతీయ అవార్డును గెలుచుకుంది. ఈ చిత్రం నవంబర్ 19, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత సాయి రాజేష్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది.


Next Story