నరేష్, పవిత్రా లోకేశ్ పలు ఆలయాలను సందర్శించారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరుపాడు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇప్పటికే ముగ్గురు మహిళలను వివాహం చేసుకున్న నరేష్.. త్వరలో నటి పవిత్ర లోకేష్ ను వివాహం చేసుకోబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది. నరేష్ ఇంకా తన మూడో భార్యకు విడాకులు ఇవ్వలేదు. నరేష్ నిర్మాతగా మళ్లీ పెళ్లి అనే సినిమా ఈ మధ్యనే అనౌన్స్ చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం ఏలూరుపాడులో నరేష్, పవిత్ర ఇద్దరూ సందడి చేశారు. నరేష్ తల్లి విజయనిర్మల స్వగ్రామం ఈ ఏలూరుపాడు. దీంతో బంధువుల ఇంట్లో ఒక ప్రైవేట్ ఫంక్షన్ లో పాల్గొనేందుకు నరేష్ ఏలూరుపాడు వచ్చారు. ఈ సందర్భంగా పవిత్రతో కలిసి నరేష్ స్థానికంగా ఉన్న అమ్మవారి దేవాలయాన్ని దర్శించి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.