Naresh, Pavitra lokesh : సూప‌ర్ ట్విస్ట్‌ 'మళ్లీ పెళ్లి' అనేది సినిమానా..? ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ వీడియో

సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్ర లోకేశ్‌లు క‌లిసి న‌టిస్తున్న చిత్రం 'మ‌ళ్లీ పెళ్లి'.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  24 March 2023 1:15 PM IST
Naresh, Malli Pelli first look

మళ్లీ పెళ్లి చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌



గ‌త కొద్ది రోజులుగా ఎక్క‌డ చూసిన సీనియ‌ర్ న‌టుడు న‌రేష్‌, న‌టి ప‌విత్ర లోకేశ్‌ల గురించే చ‌ర్చ న‌డుస్తోంది. కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా 'మ‌ళ్లీ పెళ్లి' చేసుకోబోతున్న‌ట్లు ఓ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు న‌రేష్‌. వీరిద్ద‌రికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైర‌ల్‌గా మారాయి. వీళ్లు ఇద్ద‌రు పెళ్లి చేసుకుంటున్నార‌ని అంద‌రూ దాదాపుగా ఫిక్సై పోయిన త‌రుణంలో సూప‌ర్ ట్విస్ట్ ఇచ్చారు. అదంతా ప‌బ్లిసిటీ స్టంట్ మాత్ర‌మే అని చెబుతూ.. "మ‌ళ్లీ పెళ్లి" అనే సినిమాను అనౌన్స్ చేశారు.

ఫ‌స్ట్ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ల‌ను విడుద‌ల చేశారు. ఇందులో ప‌విత్రా లోకేశ్ ముసి ముసిగా న‌వ్వుతూ ఇంటి ముద్దు ముగ్గు వేస్తుండ‌గా న‌రేష్ ఆమె ఎదురుగా కూర్చోని చిరున‌వ్వులు చిందిస్తూ ముగ్గును గ‌మ‌నిస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రాన్ని నరేశ్ హోంబ్యానర్ విజయ కృష్ణ మూవీస్‌పై నిర్మిస్తున్నారు. సహజనటి జయసుధ, శరత్‌ బాబు, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స‌మ్మ‌ర్‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే.. విడుద‌ల తేదీని మాత్రం ప్ర‌క‌టించ‌లేదు.

Next Story