'మా' లో క్షుద్ర రాజకీయం చేయోద్దు

Naresh Comments On Prakash Raj. 'మా' సభ్యులను ప్రకాష్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నార‌ని న‌రేష్ అన్నారు. ప్ర‌కాష్ రాజ్‌ అబద్దాలు

By Medi Samrat  Published on  29 Sep 2021 1:05 PM GMT
మా లో క్షుద్ర రాజకీయం చేయోద్దు

'మా' సభ్యులను ప్రకాష్ రాజ్ తప్పుదోవ పట్టిస్తున్నార‌ని ప్ర‌స్తుత అధ్య‌క్షుడు న‌రేష్ అన్నారు. ప్ర‌కాష్ రాజ్‌ అబద్దాలు చెబుతున్నార‌ని.. 'మా' లో.. క్షుద్ర రాజకీయం చేయోద్దని.. అవకాశాలు ఇప్పించేందుకే 'మా' ఉన్నదని అన్నారు. కరోనాలో ఇబ్బందులు పడ్డప్పుడు ..'మా' ఉప్పులూ, పప్పులు అంద‌జేసింద‌ని తెలిపారు. 300 పైగా ఆసుపత్రులతో 'మా' కు అసోషియేషన్ ఉందని ప్రకాష్ రాజ్ గుర్తుంచుకోవాలని అన్నారు. ప్రకాష్ రాజ్ ఒక్కసారైనా 'మా' ఎన్నికల్లో ఓటేశారా.? ఒక్క 'మా' మీటింగ్ కు అటెండ్ అయ్యారా .? ఎన్నిసార్లు 'మా' నుండి సస్పెండ్ అయ్యారో చెప్పాలని.. పోటీలోకి మీరే వచ్చారా.. ఎవరైనా తెచ్చారా.? అని ప్ర‌శ్నించారు. రెస్టారెంట్ లో డిస్కౌంట్ లా.. మాటలకు.. మ్యానిఫెస్టోకు సంబంధం లేదని అన్నారు. సరైనోడు లేడు కాబట్టి వచ్చానని.. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు ఆశ్యర్యం కలిగించింద‌ని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమలో ఉన్న గొప్ప నటులు ఉన్నారని అన్నారు. 'మా' కు ప్రెసిడెంట్ గా తెలుగోడు ఉండాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌కాశ్ రాజ్ మెంబర్ గా ఉండొచ్చని అన్నారు.


Next Story
Share it