టక్ చేసుకుని.. క‌త్తి చేత‌బ‌ట్టి బరిలో దిగిన 'జగదీష్'

Nani New Look From Tuck Jagadeesh Movie. టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాచుర‌ల్ స్టార్ నానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.

By Medi Samrat  Published on  25 Dec 2020 5:56 AM GMT
టక్ చేసుకుని.. క‌త్తి చేత‌బ‌ట్టి బరిలో దిగిన జగదీష్

టాలీవుడ్ యంగ్ హీరోల్లో నాచుర‌ల్ స్టార్ నానీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. విభిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో అందరిని మెప్పించి నాచురల్ స్టార్‌గా నిలిచాడు. తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ట‌క్ జ‌గ‌దీష్. ఈ చిత్రానికి శివ నిర్వ‌ణ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్‌లు కథానాయికలుగా కనపించనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు.ఇంత‌క‌ముందు విడుద‌ల చేసిన టైటిల్ పోస్టర్ లో టక్ చేసుకుని నిలబడిన నాని బ్యాక్ సైడ్ లుక్ ని చూపించిన మేకర్స్.. ఫస్ట్ లుక్ లో నీట్ గా టక్ చేసుకుని కూర్చున్న నాని ని చూపించారు. ఇందులో నాని ఫార్మల్ డ్రెస్ లో క్లాస్ గా కనిపిస్తూ లుక్ పరంగా కంప్లీట్ ఆపోజిట్ లో మాస్ గా కనిపిస్తున్నాడు. అరిటాకులో భోజనం చేయడానికి కూర్చున్న మన టక్ జగదీష్.. వెనుక నుంచి కత్తి తీస్తూ కోపంగా చూస్తూ ఉన్నాడు. సింగిల్ పోస్టర్ లో నాని అటు క్లాస్ ని ఇటు మాస్ ని చూపించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు.

ఈ చిత్రం ప్రస్తుతం తన చివరి షెడ్యూల్‌ పూర్తిచేసుకొంటోంది. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రాన్ని వేసివి కానుక‌గా 2021 ఏప్రిల్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.


Next Story
Share it