హీరోయిన్ నందిత శ్వేత ఇంట విషాదం
Nandita Swetha Father Passed Away. దక్షిణాది నటి నందిత శ్వేత కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రిని కోల్పోయినట్టు
By Medi Samrat Published on 20 Sept 2021 1:33 PM ISTదక్షిణాది నటి నందిత శ్వేత కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. "నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్నీ తెలియజేయాలనుకున్నాను" అని ట్వీట్ చేసింది నందిత. ఈ విషయం తెలిసిన పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సినిమాలు చేస్తోంది. "ఎక్కడికి పోతావు చిన్నవాడ"తో తెలుగు తెరకు పరిచయమైన నందిత.. వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతోంది.
This is to inform all my wellwishers that My father Mr.shivaswamy aged 54 passed away today. May his soul rest in peace
— Nanditaswetha (@Nanditasweta) September 19, 2021
"This is to inform all my wellwishers that My father Mr. Shivaswamy aged 54 passed away today. May his soul rest in peace". అంటూ నందిత చేసిన ట్వీట్ కు ఆమె సన్నిహితురాలు, నటి ఐశ్వర్య రాజేష్ స్పందించింది. నీకు ఎలాంటి సమయంలో అయినా నేను అండగా ఉన్నాను అని ఆమె తెలిపింది. "sorry nandita his blessings ll always be ther for u." అంటూ ఐశ్వర్య రాజేష్ ట్వీట్ చేసింది.
sorry nandita his blessings ll always be ther for u.
— aishwarya rajesh (@aishu_dil) September 19, 2021