నయా లుక్ లో నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా రంగంలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు

By Medi Samrat  Published on  22 Feb 2024 9:15 PM IST
నయా లుక్ లో నందమూరి మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ సినిమా రంగంలోకి ఎప్పుడు అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే గతంలో పలు మార్లు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్ లో బాగా చర్చ జరిగింది. అయితే ఇప్పటి వరకూ ఆ ప్రాజెక్టులు మొదలే అవ్వలేదు. గతంలో కాస్తా బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు చాలా స్లిమ్ గా కనిపిస్తూ ఉండడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బాలయ్య తనయుడి ఫొటోలకు నందమూరి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వెండితెర అరంగేట్రం కోసమే మోక్షజ్ఞ బరువు తగ్గాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది.

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా తన కెరీర్ లో 109 వ సినిమాలో చేస్తున్నారు. మరి బాలయ్య అభిమానులు బాలయ్య సినిమాతో పాటుగా తన వారసుడు నందమూరి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ కోసం కూడా ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ ఉన్నారు. మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని.. తనతో మల్టీ స్టారర్ కూడా తీస్తాడని బాలయ్య పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే! ఇప్పుడు నయా లుక్ లో మోక్షజ్ఞ కనిపిస్తూ ఉండడంతో ఇక మేకప్ వేసుకునే సమయం వచ్చేసిందని అభిమానులు చెబుతూ ఉన్నారు.

Next Story