సమంత, నాగ చైతన్య విడాకులపై ఎమోషనల్ పోస్టు పెట్టిన నాగార్జున

Nagarjuna Tweet About Samantha Nagachaitanya Divorce. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా

By Medi Samrat
Published on : 2 Oct 2021 7:45 PM IST

సమంత, నాగ చైతన్య విడాకులపై ఎమోషనల్ పోస్టు పెట్టిన నాగార్జున

సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. "చాలా రోజులు చర్చించిన తర్వాత భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దశాబ్ద కాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను కోరుతున్నాం" అని పోస్టులు పెట్టారు చైతూ, సామ్. వీరి విడాకుల గురించి ఎప్పటి నుండో చర్చ జరుగుతూ వచ్చింది. తాజాగా ఇద్దరూ తాము వేరవుతున్నామని ప్రకటించేశారు.

వీరిద్దరి విడాకులపై నాగ చైతన్య తండ్రి అక్కినేని నాగార్జున ఎమోషనల్ పోస్టు పెట్టారు. 'బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెపుతున్నా. సమంత, నాగచైతన్యల మధ్య జరిగినది చాలా దురదృష్టకరం. భార్య, భర్తల మధ్య ఏం జరిగిందనేని వ్యక్తిగతం. వీళ్లిద్దరూ నాకు చాలా ఇష్టమైనవాళ్లు. సమంత మాతో గడిపిన ప్రతి క్షణం మా కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆమె ఎప్పుడూ మాకు ఆప్తురాలిగానే ఉంటుంది. నాగచైతన్య, సమంతలకు భగవంతుడు శక్తిని ప్రసాదిస్తాడని కోరుకుంటున్నా' అని ట్విట్టర్ లో పోస్టు పెట్టారు.


Next Story