క్షమాపణలు చెప్పిన హీరో నాగ శౌర్య
Naga Shaurya says sorry to media about spoof interview. హీరో నాగశౌర్య నటించిన సినిమా 'రంగబలి'. థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తోంది.
By Medi Samrat
హీరో నాగశౌర్య నటించిన సినిమా 'రంగబలి'. థియేటర్లలో ప్రస్తుతం సందడి చేస్తోంది. ఈ సినిమాలో సత్య కామెడీ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ఈ సినిమాను ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి రంగబలి టీమ్ సరికొత్త అటెంప్ట్ చేసింది. మీడియా విభాగానికి చెందిన ప్రముఖులను అనుకరిస్తూ చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సత్య చేసిన ఇమిటేషన్ చాలా మందికి నచ్చింది.
తాజాగా నాగశౌర్య మాట్లాడుతూ.. ఒక హీరోను మీడియా ప్రముఖులు తమదైన శైలిలో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందనేది సరదాగా చూపించామే తప్ప, ఎవ్వరినీ ఎగతాళి చేయలేదు. ఒకవేళ దీనివల్ల ఎవరైనా హర్ట్ అయ్యుంటే, నన్ను క్షమించండని కోరారు. తమ ఉద్దేశం మీడియాపై సెటైర్ వేయడం కాదని, కేవలం ప్రమోషన్ కోసం సరదాగా చేసిన అటెంప్ట్ అని శౌర్య చెప్పుకొచ్చాడు. మీడియా, మేము ఒకటే ఫ్యామిలీ.. మేమైతే ఎప్పుడూ అలాగే అనుకుంటాం. ఎలాగైతే మీడియా వాళ్లు చంద్రబాబు, కేసీఆర్‌ల డూప్‌లు పెట్టి వీడియోలు చేస్తారో.. మేము మా సినిమాని ప్రమోట్ చేయడం కోసం ఇలా స్పూఫ్ వీడియో తీశామని అన్నాడు. "ఎవ్వరినీ హర్ట్ చేయకుండా, అందరికీ తెలిసిన వ్యక్తుల్నే సెలెక్ట్ చేశాం. మేము ఎవరి మీదైతే స్పూఫ్ చేశామో.. వాళ్లే మా వీడియోని బాగా ఎంజాయ్ చేశారు. ఎవరూ హర్ట్ అవలేదు’’ అని వివరణ ఇచ్చాడు శౌర్య.
శుక్రవారం రోజు వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ కోటి ఎనభై లక్షల గ్రాస్‌ను, 90 లక్షల షేర్‌ను సొంతం చేసుకుంది. నైజాంలో అత్యధికంగా ఈ మూవీ 30 లక్షలకుపైగా వసూళ్లను రాబట్టింది. ఆరు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రంగబలి సినిమా రిలీజైంది.