చైతూ ఎప్పుడో చెరిపేశాడు.. గమనించలేదంటే..

Naga Chaitanya Tattoo. సమంత-నాగచైతన్య విడాకులపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సమంత, నాగచైతన్య

By Medi Samrat  Published on  2 Oct 2021 12:21 PM GMT
చైతూ ఎప్పుడో చెరిపేశాడు.. గమనించలేదంటే..

సమంత-నాగచైతన్య విడాకులపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ఇద్దరు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించారు. "చాలా రోజులు చర్చించిన తర్వాత భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. దశాబ్ద కాలంగా మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని అదృష్టంగా భావిస్తున్నాం. మా మధ్య ఉన్న స్నేహం చాలా ప్రత్యేకమైంది. ఇలాంటి కఠిన సమయంలో మమ్మల్ని అర్థం చేసుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను కోరుతున్నాం" అని పోస్టులు పెట్టారు చైతూ, సామ్.

సమంత-నాగచైతన్య తమ ప్రేమ బంధంలో భాగంగా టాటూలను వేసుకున్నారు. చైతూ సామ్ ఇద్దరూ కుడిచేతి మణికట్టు భాగంలో యారో మార్క్స్‌ను ఒకే రకంగా టాటూ వేయించుకున్నారు. ఈ టాటుకు సంబంధి పలు ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. తమ బందానికి గుర్తుగా ఇద్దరం ఒకే రకమైన టాటూలు వేయించుకున్నామని చెప్పారు చై సామ్‌. ఇవే కాదు చై మీద ప్రేమను ఓ సీక్రెట్‌ టాటూతో చూపించారు సామ్‌. ఏకంగా చైతన్య సంతకాన్ని తన తన నడుము మీద ఉన్న టాటూగా వేయించుకున్నారు.

నాగచైతన్య చేతి మీద సమంత పేరుతో టాటూ ఉంటే.. సమంత చేతి మీద నాగచైతన్య పేరుతో టాటూ ఉంది. కానీ విడాకులకు ముందే తన చేతిపై ఉన్న టాటూను చెరిపేశాడు నాగచైతన్య. అప్పుడే ఇద్దరి మధ్య అనుబంధం తగ్గిందని ప్రపంచానికి తెలిసిపోయింది. సమంత కూడా తన పేరులో అక్కినేని పదాన్ని తొలగించడంతో మరింత క్లారిటీ వచ్చింది. దీంతో ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. అదే ఇప్పుడు నిజమైంది.


Next Story
Share it