సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు మ‌హేశ్‌, బ‌న్నీ నిర్మాతలు ఫిర్యాదు

Mythri Movie Makers Complaint To Cyber Crime Department. నిర్మాతలకు సినిమా రిలీజ్ చేయడం ఎంత క‌ష్ట‌మో, రిలీజ్ ముందు స‌ద‌రు సినిమాల‌ను

By Medi Samrat  Published on  16 Aug 2021 1:17 PM GMT
సైబ‌ర్ క్రైం పోలీసుల‌కు మ‌హేశ్‌, బ‌న్నీ నిర్మాతలు ఫిర్యాదు

నిర్మాతలకు సినిమా రిలీజ్ చేయడం ఎంత క‌ష్ట‌మో, రిలీజ్ ముందు స‌ద‌రు సినిమాల‌ను లీకులు కాకుండా కాపాడుకోవ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. సినిమాలు రిలీజ్ తర్వాత పైరసీ కాకుండా ఆప‌లేక‌పోతున్నామ‌ని బాధ‌ప‌డుతున్న నిర్మాత‌ల‌కు ఇప్పుడు లీకుల గోల పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. రీసెంట్‌గా మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్న భారీ చిత్రాలు పుష్ప‌, స‌ర్కారువారిపాట సినిమాల‌కు సంబంధించిన లీకులు సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌న‌మిచ్చాయి. స‌ర్కారువారి పాట ఫ‌స్ట్ లుక్‌, పుష్ప సినిమా నుంచి దాక్కో దాక్కో మేక సాంగ్ విడుద‌ల చేయాల‌నుకున్న స‌మ‌యం కంటే ముందే సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఓ ద‌శ‌లో అయితే నిర్మాత‌లు కావాల‌నే లీకులు చేస్తున్నార‌నే వార్త‌లు కూడా వినిపించాయి. అయితే లీకుల వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

'' రీసెంట్‌గా మేం చేస్తున్న సినిమాలు స‌ర్కారువారిపాట‌, పుష్పకు సంబంధించిన కంటెంట్‌ బ‌య‌ట‌కు రావ‌డం మ‌మ్మ‌ల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. ఎవ‌రో ఈ ప‌నుల‌ను చేసి రాక్ష‌సానందాన్ని పొందుతున్నారు . ఇటువంటి ప‌నుల వ‌ల్ల ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఉండే ఎగ్జ‌యిట్‌మెంట్ పోతుంది. కాబ‌ట్టి మా మైత్రీ మూవీ మేకర్స్ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకుని సైబ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాం. త‌ప్పు చేసిన వారిని ప‌ట్టుకుని శిక్ష‌ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటాం. ఎవ‌రూ పైర‌సీని ప్రోత్స‌హించ‌వ‌ద్దు'' అంటూ ఓ లెట‌ర్‌ను కూడా మైత్రీ మూవీ మేక‌ర్స్ ట్విట్ట‌ర్‌లో విడుద‌ల చేసింది.


Next Story