మరో రీరిలీజ్.. కంప్లీట్ డిజాస్టర్..!
ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకోగా..
By Medi Samrat Published on 2 Dec 2023 6:45 PM ISTప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ ను సొంతం చేసుకోగా.. ఇంకొన్ని చాలా వరకూ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. అయితే డిసెంబర్ 2న రజనీకాంత్ సినిమాను రీరిలీజ్ చేయాలని అనుకుని చేసిన ప్లాన్స్ పూర్తిగా బెడిసికొట్టాయి. రజనీకాంత్ 'ముత్తు' రీ-రిలీజ్ షోలు అన్నీ ఏపీలో రద్దయ్యాయి. స్టార్ హీరోల పాత చిత్రాలను అభిమానులు మళ్లీ విడుదల చేయడంతో రీ-రిలీజ్ ట్రెండ్‌కి ప్రత్యేక క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ముత్తు రీ-రిలీజ్ షోలు రద్దయినట్లు వార్తలు వస్తున్నాయి.
కొందరు పాత సూపర్ హిట్ చిత్రాలను కొనుగోలు చేసి రైట్స్, ప్రమోషన్ల కోసం భారీ మొత్తాలను ఖర్చు పెడుతున్నాయి. రజనీకాంత్ ముత్తు సినిమా ఈరోజు రీలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరంగా ఉన్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని షోలు రద్దయ్యాయి. మరో రజనీకాంత్ చిత్రం, శివాజీ ఈ నెలలో ఆయన పుట్టినరోజున విడుదల చేయనున్నారు. అయితే రిలీజ్ ఉంటుందో లేదో వేచి చూడాలి. కాబట్టి రీ-రిలీజ్ చిత్రాలతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది. K S రవి కుమార్ దర్శకత్వం వహించిన ముత్తు సినిమాలో రజనీకాంత్ సరసన మీనా కథానాయికగా నటించింది. ఈ సినిమా 1995లో విడుదలైంది. AR రెహమాన్ స్వరపరచిన పాటలు నేటికీ శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. 1995 అక్టోబర్ 23న విడుదలైన ముత్తు సూపర్ హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా భారీ కలెక్షన్లతో బాక్సాఫీసును షేక్ చేసింది.