రిలేషన్ షిప్ స్టేటస్ బయట పెట్టిన మృణాల్
సీతారామం సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రస్తుతం నానితో
By Medi Samrat Published on 12 Oct 2023 8:30 PM ISTసీతారామం సినిమాతో దక్షిణాది ప్రేక్షకులకు కూడా దగ్గరైన బ్యూటీ మృణాల్ ఠాకూర్. ఆమె ప్రస్తుతం నానితో 'హాయ్.. నాన్న' సినిమాలో చేస్తోంది. ఇక బాలీవుడ్ లో ఆమె నటించిన 'ఆంఖ్ మిచోలీ' అక్టోబర్ 27 న విడుదల కానుంది. ఈ సినిమాలో అభిమన్యు దాసాని, పరేష్ రావల్ తదితరులు నటించారు. కళ్ళు కనిపించని యువతి పాత్రలో మృణాల్ కనిపించనుంది.
తన సినిమా ప్రమోషన్‌లో భాగంగా మృణాల్ ఠాకూర్ తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి బయటపెట్టింది. తాను ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని తెలిపింది. పెళ్లి చేసుకోమంటూ ఇంట్లో వాళ్లు నన్ను అడుగుతున్నారని తెలిపింది. ప్రస్తుతానికి అయితే పెళ్లిపై ఆసక్తి లేదని.. కెరీర్‌పైనే ఫోకస్ పెట్టానని తెలిపింది. కెనడియన్ నటుడు కీను రీవ్స్ అంటే నాకెంతో ఇష్టం. అతడి లాంటి వ్యక్తి కోసం నేను ఎదురుచూస్తున్నానని ఆమె తెలిపింది. కీను రీవ్స్ మ్యాట్రిక్స్, జాన్ విక్ సినిమాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకున్న స్టార్ నటుడు. సీతారామం సినిమా తర్వాత తెలుగులో నన్ను అభిమానించే వారి సంఖ్య పెరిగిందని.. వారి అంచనాలకు తగిన విధంగా సినిమాలలో నటించాలనుకుంటున్నానని తెలిపింది. ‘సీతారామం’ తర్వాత తెలుగులో మరో ప్రాజెక్ట్ ఓకే చేయడానికి చాలా సమయం పట్టిందని.. ‘హాయ్ నాన్న’ కథ నచ్చడంతో ఆ సినిమాలో నటిస్తున్నానని తెలిపింది మృణాల్. సీరియల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న మృణాల్ కొన్ని మరాఠీ, బాలీవుడ్ సినిమాలలో చేసింది. సీతారామం లాంటి క్లాసిక్ తో ఆమె పాపులారిటీ దేశం మొత్తం వ్యాపించింది.