మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Most Eligible Bachelor Release Date. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్-పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన

By Medi Samrat  Published on  7 Sep 2021 7:11 AM GMT
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్-పూజ హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'..! ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా రోజులే అయింది. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా సినిమా రిలీజ్ కు సంబంధించిన అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా దసరా కానుకగా బరిలోకి దిగబోతోంది.

దసరా రోజుల్లో మాత్రం ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. తాజా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. అక్టోబర్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇప్పటికే పాటలు బాగా హిట్ అయ్యాయి. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా నిర్మితమైంది.

జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.


Next Story