మోనాల్.. ఓంకార్ షోలో సందడి చేయనుందా.?
Monal Gajjar Makes TV Debut As Judge For Omkar Dance Plus. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును
By Medi Samrat Published on 26 Dec 2020 5:32 PM ISTబిగ్ బాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపును సంపాదించుకుంది మోనాల్. ఈ ఏడాది అంతో ఇంతో యూత్ బిగ్ బాస్ షోకు అడిక్ట్ అయ్యారంటే అందుకు మోనాల్ కూడా ఒక కారణం అని అంటున్నారు. బిగ్ బాస్ అయిపోయాక కొందరికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మోనాల్ కు కూడా అలాంటి అవకాశమే వచ్చిందని అంటున్నారు.
బిగ్ బాస్4 షో ముగిశాక ఎట్టకేలకు మోనాల్ కు పలు ఆఫర్లు క్యూ కడుతున్నాయని సమాచారం. డ్యాన్స్ ప్లస్ అంటూ ఓంకార్ చేయనున్న క్రేజీ కార్యక్రమంలో మోనాల్ హోస్ట్‌గా కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది. తాజాగా మోనాల్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఈ కార్యక్రమంలో అమ్మడి పాత్ర ఏంటనే దానిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. హోస్ట్ గా ఇప్పటికే పలువురు అందాల భామలు బుల్లితెర సందడి చేస్తూ ఉండగా.. ఆ లిస్ట్ లోకి మోనాల్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
మోనాల్ 2011లో రేడియో మిర్చి నిర్వహించిన మిర్చి క్వీన్ బీ అందాల పోటీలో పాల్గొని గెలిచింది. ఆ తరువాత ఆమె మిస్ గుజరాత్ టైటిల్ ని కూడా గెలుచుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోనూ, మరి కొన్ని భాషల్లోనూ నటించింది. అయితే పెద్దగా స్టార్ అవ్వలేకపోయింది. ఇక బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్లకు పలు అవకాశాలు ఇస్తున్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో మోనాల్ కు కూడా తెలుగులో హోస్ట్ గా అవకాశం రావడం విశేషం. అమ్మడు తెలుగు ఇంకాస్త నేర్చుకుంటే బుల్లితెర మీద వరుసగా ప్రోగ్రామ్స్ కూడా చేసుకోవచ్చు.