సన్ ఆఫ్ ఇండియా.. థియేటర్స్ లో ఎందుకు ఇలా..!
Mohan Babu’s Son of India Movie. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’.
By Medi Samrat Published on 19 Feb 2022 8:56 AM GMTమోహన్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'. ఫిబ్రవరి 18న మూవీ రిలీజైంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం 'సన్నాఫ్ ఇండియా' గురించి తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. సినిమా రిలీజ్ కు ముందు ట్రోల్స్.. సినిమా విడుదలయ్యాక కూడా కొనసాగుతూ ఉన్నాయి. మొదటి రోజు కొన్ని చోట్ల 'సన్నాఫ్ ఇండియా' సినిమా చూసేందుకు ప్రేక్షకులు లేక షోలు క్యాన్సిల్ అయిన సందర్భాలున్నాయి. సినిమా విడుదలైన చాలా చోట్ల థియేటర్స్ నిర్వాహకులకు కనీసం కరెంట్, రెంట్, క్యాంటీన్, పార్కింగ్ వంటి మెయింటెన్స్ కూడా రాలేదు.
తెలుగులో గత కొన్నేళ్లుగా ఏ సినిమాకు లేని డిజాస్టర్ ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమాను మొత్తంగా 350 పైగా థియేటర్స్‌లో విడుదల చేశారు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన ఆఫీసర్ ను ఎలాగైతే రెండో షో నుండి థియేటర్లలో తీసేశారో.. ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా ఆ ఫీట్ ను అందుకుంది. ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రగ్యా జైశ్వాల్, పోసాని కృష్ణమురళి, సునీల్, అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సన్ ఆఫ్ ఇండియా'.