మోహన్‌బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ

Minister Perni Nani meets Manchu Mohan Babu in Hyderabad. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో సినీ నటుడు

By Medi Samrat  Published on  11 Feb 2022 10:47 AM GMT
మోహన్‌బాబుతో ఏపీ మంత్రి పేర్ని నాని భేటీ

ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని శుక్రవారం హైదరాబాద్‌లో సినీ నటుడు మోహన్‌బాబును కలిశారు. మంత్రి మోహన్ బాబు ఇంటికి వెళ్లి చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో చిరంజీవి ప్రతినిధి బృందం భేటీ వివరాలను మోహన్‌బాబుకు నాని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని గురువారం (ఫిబ్రవరి 10) సినీ ప్రముఖులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు.

సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే శుభవార్త వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌తో భేటీపై చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌కు పరిశ్రమ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ''పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇస్తూ.. చాలా సానుకూలంగా స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిశ్రమ త్వరలో శుభవార్త అధికారికంగా వింటుందని ఆశిస్తున్నానని చిరంజీవి ట్వీట్ చేశారు.


Next Story
Share it