మీటర్ సినిమా ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది అప్పుడే..!

Meter Movie Trailer Will Be Out On March29. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

By Medi Samrat  Published on  26 March 2023 3:45 PM GMT
మీటర్ సినిమా ట్రైలర్ బ్లాస్ట్ అయ్యేది అప్పుడే..!

Kiran Abbavaram


యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ మధ్యనే ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇప్పుడు ‘మీటర్‌’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. రమేష్‌ కాడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటుంది. యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ కు టైమ్ వచ్చిందని చిత్ర బృందం చెబుతోంది. తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 29న రిలీజ్‌ చేస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ సినిమాలో కిరణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపించబోతున్నాడు. క్లాప్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై చెర్రీ, హేమలత పెదమాళ్లు ఈ సినిమాను నిర్మించారు. సాయి కార్తిక్‌ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతోంది. కిరణ్ అబ్బవరం బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోబోతున్నాడా లేదా అనేది త్వరలోనే తెలిసిపోనుంది.


Next Story
Share it