నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా.. నేను వెళ్లను.. ఇదే ఇండస్ట్రీలో ఉంటాను

kiran abbavaram shocking comments vinaro bhagyamu vishnu katha. కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'

By M.S.R  Published on  22 Feb 2023 4:13 PM IST
నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా.. నేను వెళ్లను.. ఇదే ఇండస్ట్రీలో ఉంటాను

Vinaro Bhagyamu Vishnu Katha Success Meet



యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళీ కిషోర్‌ అబ్బురు దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా బాగుంది. మంచి కలెక్షన్స్ వచ్చాయి. అయినా కూడా కొందరు సినిమాను తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారనే వాద‌న విన‌వ‌స్తుంది. సినిమా బాగాలేదంటూ ఓ బ్యాచ్ కావాలనే నెగటివ్ పోస్టులను ప్రజల మీదకు రుద్దుతూ వస్తున్నారని ప్ర‌చారం నడుస్తోంది. గతంలో కిరణ్ అబ్బవరం సినిమాల విషయంలో కూడా అతడికి వ్యతిరేకంగా కొందరు పని చేశారు. పవర్ స్టార్ అనే పేరు సినిమాలో లేకున్నా కూడా కొందరు కావాలనే ఎడిట్ చేసిన పోస్టు కారణంగా కిరణ్ అబ్బవరం విమర్శలు ఎదుర్కొన్నాడు.

ఇక తాజాగా హిట్ అందుకున్న వినరో భాగ్యము విష్ణు కథ చిత్రయూనిట్‌ మంగళవారం సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి కిరణ్‌ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ బాగా సపోర్ట్‌ చేశారని.. కానీ కొన్ని బ్యాచులు మాత్రం ట్విటర్‌లో నాపై కావాలని విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఇంతకు ముందు చేసిన ఒకటీ రెండు సినిమాలు బాలేవు, నన్ను విమర్శించారు. ఈ సారి ఎలాంటి విమర్శ రాకూడదని పకడ్బందీగా ప్లాన్‌ చేసి మంచి మంచి సీన్లు పెట్టాం. అయినా కూడా కొంతమంది సినిమా బాలేదంటున్నారు బ్రో అని మావాళ్లు కొన్ని మెసేజ్‌లను నాకు చూపిస్తున్నారు. అసలు ఎవరంటున్నారు? ఎందుకు బాలేదంటున్నారు అని వివరాలు ఆరా తీస్తే వాళ్లసలు ఇక్కడివాళ్లే కాదని తెలిసిందని చెప్పాడు కిరణ్ అబ్బవరం. డబ్బులు ఇస్తే బాలేదని వరుస కామెంట్లు చేస్తున్నారు. ఇలాగైతే మాలాంటి యంగ్‌ హీరోలు ఎలా ఎదుగుతారు? మీరు నన్ను ఇంటికి పంపించేయాలనుకున్నా నేను వెళ్లను. ఇదే ఇండస్ట్రీలో ఉంటాను.. నన్ను కిందకు లాగినా నాకేం పోదని చెప్పుకొచ్చారు కిరణ్ అబ్బవరం.


Next Story