ఆ సినిమా టికెట్ ధరను భారీగా తగ్గించేశారు

Memu Famous Movie Tickets Price Reduced By Producers. మేమ్ ఫేమస్ సినిమా మే 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీమ్ మంచిగా

By Medi Samrat  Published on  23 May 2023 9:30 PM IST
ఆ సినిమా టికెట్ ధరను భారీగా తగ్గించేశారు

మేమ్ ఫేమస్ సినిమా మే 26న విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా టీమ్ మంచిగా ప్రమోషన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది. రెగ్యులర్ ప్రమోషన్లతోపాటు టికెట్ల ధరలను తగ్గించే నిర్ణయం కూడా మేకర్స్ తీసుకున్నారు. ఈ సినిమా టికెట్లు కేవలం రూ.99కే ఇవ్వాలని నిర్ణయించారు. ఈ సినిమా రిలీజైన రోజు కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో కేవలం రూ.99కే చూడొచ్చు. సుమంత్ ప్రభాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ U/A సర్టిఫికేట్ ఇచ్చింది. 2:29:59 సినిమా రన్‌టైమ్ లాక్ చేశారు. ఈ సినిమాకు శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ , కళ్యాణ్ సంగీతం అందించారు.లహరి ఫిల్మ్స్,చాయ్ బిస్కెట్ ఫిలింస్ రెండోసారి కలసి చేస్తున్న సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ చిత్రంలో మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర ప్రధాన తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ నిర్మించారు. ఈ సినిమాను అల్లు అరవింద్‌ విడుదల చేస్తున్నారు.


Next Story