చిరంజీవి మాటలకు థంబ్స్‌అప్ సైగ చేసిన కైకాల.. ఆనందంతో
Megastar chiranjeevi wishes kaikala satyanarayana a speedy recovery. ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడనని,
ప్రముఖ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఆయనతో ఫోన్‌లో మాట్లాడనని, తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విటర్ వేదికగా అందరికి తెలిపారు. సీనియర్ నటుడు, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ నిన్న తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కైకాల సత్యనారాయణకు చిరంజీవితో మంచి అనుబంధ ఉంది. చిరంజీవి హీరోగా నటించిన చాలా సినిమాల్లో సత్యనారాయణ కీలక పాత్రలు చేశారు.
"ఐసీయూలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ గారు స్పృహలోకి వచ్చారని తెలవగానే ఆయనను ట్రీట్ చేస్తున్న క్రిటికల్ కేర్ డాక్టర్ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనను ఫోన్‌లో పలకరించాను. ఆయన త్వరగా కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది. ట్రాకియాస్టోమీ కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, మళ్లీ త్వరలో ఇంటికి తిరిగిరావాలని, ఆ సందర్భాన్ని అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్ సుబ్బారెడ్డి తెలిపారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితోనూ ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది." అంటూ మెగస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.