మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్

Megastar Chiranjeevi Valtheru Veeraiah Release Date Fix. చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'.

By Medi Samrat  Published on  7 Dec 2022 6:00 PM IST
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య రిలీజ్ డేట్ ఫిక్స్

చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. సంక్రాంతి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, జనవరి 13 తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. చిరంజీవి సరసన నాయికగా శ్రుతి హాసన్ కనిపించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకేక్కించింది.

చిరంజీవి కెరీర్‌లో 154వ చిత్రంగా వస్తోంది ఈ సినిమా. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన 'బాస్' సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో హిందీ హీరోయిన్ ఊర్వశీ రౌటేలాతో చిరు చిందేసారు. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో బాలయ్య వీరసింహా రెడ్డి, విజయ్ వారసుడు, అజిత్ తునివు ఉన్నాయి.


Next Story