సింధుని స‌త్క‌రించిన చిరంజీవి

Megastar Chiranjeevi Felicitates PV Sindhu at his House. వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్

By Medi Samrat  Published on  28 Aug 2021 8:18 PM IST
సింధుని స‌త్క‌రించిన చిరంజీవి

వరుస ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన పీవీ సింధుని మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు ఆగస్ట్ 20వ తేదీన తమ ఇంటిలో ఘనంగా సత్కరించారు. ఇందుకు సంబంధించి ''దేశం గర్వించేలా వరుసగా రెండు సార్లు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన మన పీవీ సింధుని ఆత్మీయుల మధ్య సత్కరించుకోవటం ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

పీవీ సింధుని సత్కరించుకోవడం.. తన బిడ్డను సత్కరించుకున్నట్లే ఉందని తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేయగా.. స్వచ్ఛమైన ప్రేమ చూపించే ఇలాంటి వారికోసం ఇంకా కష్టపడేందుకు ప్రయత్నిస్తానని సింధు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో చిరు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు కింగ్ నాగార్జున ఫ్యామిలీ, అల్లు అరవింద్ ఫ్యామిలీ, టి. సుబ్బరామిరెడ్డి, సుహాసిని మణిరత్నం, రాధికా శరత్ కుమార్, రానా దగ్గుబాటి, శర్వానంద్, అజారుద్దీన్, చాముండేశ్వరీనాధ్‌ తదితరులు పాల్గొన్నారు.


Next Story