పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

Megastar Chiranjeevi Comments On Pawan Kalyan. వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి

By Medi Samrat  Published on  20 Nov 2022 6:00 PM IST
పవన్ కళ్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన చిరంజీవి

వైఎన్ఎం కాలేజి పూర్వవిద్యార్థుల సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కళ్యాణ్ మాటలు అంటాడు.. పడతాడు. పవన్‌ కళ్యాణ్ కు మీరంతా ఉన్నారు. మీ అందరి ఆశీస్సులతో మనం ఏదో ఒక రోజు పవన్‌ కళ్యాణ్ ను అత్యున్నత స్థానంలో చూస్తామని అన్నారు చిరంజీవి.

తాను ఇప్పటివరకు అనుకువన్నీ చేశానని.. తనకు కష్టాన్ని ఎదుర్కొనే గుణాన్ని, పనితనాన్ని నేర్పింది ఎన్ సీసీ అని అన్నారు. కాలేజీలో వేసిన నాటకంతో సినిమాల్లోకి వచ్చానని.. అప్పటినుంచి, అనుకున్నదాని అంతు చూడడం నేర్చుకున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అనుకున్నది చేసే రకమని.. రాజకీయాలకు పవన్ తగినవాడని అన్నారు. ఏదో ఒకనాడు పవన్ కల్యాణ్ ను గొప్ప స్థాయిలో చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మాటలు పడాల్సి ఉంటుందని, ఒక్కోసారి మనం కూడా మాటలు అనాల్సి ఉంటుందని చిరంజీవి అన్నారు. మొరటుగా, కటువుగా లేకపోతే రాజకీయాల్లో రాణించలేరని, ఓ దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవిని స్నేహితులు, కాలేజీ యాజమాన్యం సత్కరించారు.


Next Story