'బ్రహ్మాస్త్ర' నుండి నాగార్జున పవర్‏ఫుల్ లుక్ రిలీజ్‌

Meet Nagarjuna As The Mighty "Artist" Anish. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కరణ్ జోహార్ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో భాగమైన

By Medi Samrat  Published on  11 Jun 2022 5:49 PM IST
బ్రహ్మాస్త్ర నుండి నాగార్జున పవర్‏ఫుల్ లుక్ రిలీజ్‌

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కరణ్ జోహార్ 'బ్రహ్మాస్త్ర' సినిమాలో భాగమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, డింపుల్ కపాడియా, ధ్రువ్ సెహగల్, సౌరవ్ గుజార్, దివ్యేందు శర్మ లు నటిస్తూ ఉండగా.. షారూఖ్ ఖాన్ అతిధి పాత్రలో మెరవనున్నారు. ఇక ఈ భారీ బడ్జెట్ సినిమా కోసం మేకర్స్ ప్రమోషన్లను ప్రారంభించారు. సినిమాలోని ప్రధాన పాత్రలకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. సినిమాలోకి క్యారెక్టర్స్ కు సంబంధించి మోషన్ పోస్టర్‌లను కూడా వదులుతున్నారు. ఇప్పటికే అమితాబ్ బచ్చన్‌ను పరిచయం చేశారు. తాజాగా అక్కినేని నాగార్జున మోషన్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు.

భారీ బడ్జెట్‏తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వహిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబర్ 9న హిందీ తెలుగు తమిళం కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో అనిష్ విశిష్ట్ పాత్రలో నాగార్జున్ కనిపించనున్నట్లుగా తెలుస్తోంది. అతని గురించి తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. "సహస్ర నందిమ్ సామర్ధ్యం.. హే నంది అస్త్రం.. ఖండ ఖండ ఖురు.. మామ్ సహాయకం, మామ్ సహాయకం" అంటూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ట్రైలర్ ఈ నెల 15న విడుదల చేయనున్నారు.







Next Story