వడివేలుకు అవకాశం నేను ఇస్తాను
Meera Mithun invited Vadivelu to act. వడివేలు.. పరిచయం అవసరం లేని హాస్యశిఖరం. ఎన్నో సినిమాలలో తనదైన నటనతో
By Medi Samrat
వడివేలు.. పరిచయం అవసరం లేని హాస్యశిఖరం. ఎన్నో సినిమాలలో తనదైన నటనతో అలరించారు. అయితే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా వడివేలు.. దశాబ్దకాలంగా సినిమాలకు దూరమయ్యారు. అయినప్పటికీ వడివేలుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. సోషల్ మీడియాలో వడివేలు హాస్యనటనకు సంబంధించిన ఫోటోలు.. మీమ్స్ గా సందడి చేస్తున్నాయి.
అయితే.. ఇటీవల ఓ కార్యక్రమంలో వడివేలు మాట్లాడుతూ.. నటనకు దూరమై పదేళ్ళు గడిచిందని.. అయినా సినిమాల్లో నటించే ఉత్సాహం, కామెడీ పండించే శక్తి తనలో ఏమాత్రం తగ్గిపోలేదని.. అయినా ఏ ఒక్కరూ అవకాశం ఇవ్వడం లేదంటూ వాపోయారు. వడివేలు మాటలకు వివాదాస్పద నటి మీరా మిథున్ కదిలింది. ఆయన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని.. 'త్వరలో నేను నిర్మించబోయే సినిమాలో వడివేలుకు అవకాశం ఇస్తాను. ఆయన నటించాలని భావిస్తే తప్పకుండా ఆ చిత్రంలో నటించవచ్చని ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
జీవితంలో విజయవంతంగా దూసుకుపోతున్న వారిని మోసంతోనో, వంచనతోనో తొక్కేస్తుంటారని.. నిజానికి, ఏ వ్యక్తి మరో వ్యక్తిని అణిచివేయలేరని.. వడివేలు లాంటి దిగ్గజాలు కన్నీరు పెట్టకూడదని మీరా మిథున్ వ్యాఖ్యానించింది. ఇదిలావుంటే.. వడివేలు మాటలు విన్న హీరో సూర్య కూడా తన నెక్ట్స్ సినిమాలో అవకాశం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.