ఓజీ టీజర్ సిద్ధమవుతోందట..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమా టీజర్
By Medi Samrat
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీగా ఆశలు పెట్టుకున్న సినిమా 'ఓజీ'. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా వచ్చేస్తుందని ప్రచారం జరుగుతూ ఉండడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారని.. 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు టాక్. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది. రన్ రజా రన్, సాహో చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకుని సుజీత్ ఈ సినిమా చేస్తున్నాడు. కొత్త కథను చూపించబోతూ ఉండడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కొన్ని రోజుల క్రితం ముంబై, పూణే షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది ఓజీ. ఇక పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్ దశలో ఉంది. క్రిష్ డైరెక్ట్ చేస్తున్న హరిహరవీరమల్లులో కూడా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.