మార్క్ ఆంటోనీ మీ ఇళ్లలోకి, మొబైల్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాడు

విశాల్ హీరోగా నటించిన సినిమా 'మార్క్ ఆంటోనీ'. వినాయక చవితి కానుకగా థియేటర్లలో సందడి చేసిన

By Medi Samrat  Published on  10 Oct 2023 9:30 PM IST
మార్క్ ఆంటోనీ మీ ఇళ్లలోకి, మొబైల్ ఫోన్స్ లోకి వచ్చేస్తున్నాడు

విశాల్ హీరోగా నటించిన సినిమా 'మార్క్ ఆంటోనీ'. వినాయక చవితి కానుకగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమాలో నట రాక్షస ఎస్.జె.సూర్య కీలక పాత్రలో అలరించారు. ఇక ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఈ నెల 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ సినిమా తమిళంలో 100 కోట్ల మార్కు కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. విశాల్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

టైమ్ ట్రావెల్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. హీరో విశాల్, విలన్ గా ఎస్.జె. సూర్య ద్విపాత్రాభినయంతో ఈ సినిమాలో కనిపిస్తారు. వినోద్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించాడు. రీతూ వర్మ కథానాయికగా నటించింది. సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అక్టోబర్ 13న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో ప్రీమియర్‌ అవ్వనుంది. మార్క్ ఆంటోని చిత్రం థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాత OTTలో విడుదలవ్వనుంది.

Next Story