ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు కలిశారు. ఈ రోజు(మంగళవారం) తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంచు విష్ణు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ''సీఎం జగన్ ను కలవడం ఇది మూడో సారి. నాకు వరుసకు బావ అవుతారు.అయినా అన్న అని పిలుస్తాను. ఇవాళ కలిసింది పూర్తిగా పర్సనల్ విజిట్'' అని తెలిపారు. తాపే తిరుపతిలో స్టూడియోలు కడతానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు తమకు కావాలి. తెలంగాణ, ఆంధ్రా రెండు కళ్లు అని పేర్కొన్నారు.
విశాఖలో అవకాశాల కోసం ఫిల్మ్ ఛాంబర్లో చర్చిస్తామని మంచు విష్ణు అన్నారు. మొన్న జరిగిన చర్చల్లో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని, తమ నాన్నకి ఇన్విటేషన్ వచ్చిందని, అయినా ఆయనకు అందజేయలేదన్నారు. మంత్రి పేర్ని నాని తో సమావేశం పై ఒక వర్గం మీడియా దుష్ప్రచారం చేసిందన్నారు. తనకు అన్ని పార్టీల్లోనూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారు, టీడీపీలో కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వున్నారని చెప్పారు. మంత్రి పేర్ని నాని తమ ఇంటికి వస్తే ఏదో కారణాలు చెప్తూ ప్రచారం చేశారు. తమకు సపోర్ట్ లేకపోతే 'మా' ప్రెసిడెంట్ గా ఎలా గెలుస్తానని మంచు విష్ణు అన్నారు. అందరినీ చిత్తు చిత్తుగా ఓడించానని, తమ నాన్నకు ఇన్విటేషన్ అందకపోవడం పై ఫిల్మ్ ఛాంబర్ లో చర్చిస్తాం అన్నారు. ప్రభుత్వం ఇన్విటేషన్ పంపినా నాన్నకి అందజేయలేదన్నారు. ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్. ఎవరు ఇలా చేశారో మాకు తెలుసన్నారు. ఎలా కరెక్ట్ చేయాలో తాము ఆలోచిస్తాం అని మంచు విష్ణు చెప్పారు.