ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఎంతగానో బాధపడ్డాను

Manchu Lakshmi about Amir khan. మోహన్‌ బాబు త‌న‌య‌ మంచు లక్ష్మీ తెలుగు సినీ అభిమానులందరికీ పరిచయమే.

By Medi Samrat  Published on  29 Nov 2020 2:48 AM GMT
ఆ హీరోని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. ఎంతగానో బాధపడ్డాను

మోహన్‌ బాబు త‌న‌య‌ మంచు లక్ష్మీ తెలుగు సినీ అభిమానులందరికీ పరిచయమే. నటిగా, వ్యాఖ్యాతగా, నిర్మాతగా రాణిస్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన‌ మంచు లక్ష్మీ ఆసక్తికర విషయాన్ని వెల్ల‌డించింది. త‌న ల‌వ్ విష‌య‌మై మాట్లాడింది. ఓ స్టార్‌ హీరోను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాని.. ఆ హీరో పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతగానో బాధపడ్డాన‌ని చెప్పుకొచ్చింది.

ఇంతకీ లక్ష్మీకి న‌చ్చిన హీరో ఎవరా అనుకుంటున్నారా? బాలీవుడ్ సూ‌ప‌ర్ స్టార్‌ ఆమీర్‌ ఖాన్‌. ఆయనకి పెళ్లి అయిన‌ప్పుడు ఏడ్చేసాన‌ని తెలిపింది. ఇక ఆమీర్‌ ఖాన్‌ రెండో సారి పెళ్లి చేసుకునే సమయంలో కూడా ఏడ్చేసిందట. ఇక అమీర్ ఖాన్‌ సినిమాలు సెలక్ట్ చేసుకునే విధానం.. త‌న‌ను ఎంతగానో ఆకట్టుకుంటుందని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్‌లో మ‌న్మ‌థుడు నాగార్జున అంటే కూడా అంతే ఇష్టమని తెలిపింది మంచు లక్ష్మీ.Next Story
Share it